హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని డీవైఎస్‌ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ విద్యార్థులు గురువారం రాత్రంతా జాగారం చేశారు. రాత్రి 10 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓ వైపు దోమలు స్వైర విహారం చేయగా.. విద్యార్థినులు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఉదయం కాలకృత్యాలకు నీళ్లు లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హాస్టల్ ఎదురుగా ఉన్న జిమ్నాస్టిక్స్ హాల్ వద్ద గల బోరు వేయడంతో బకెట్లలో నీళ్లు తెచ్చుకుని బడికి వెళ్లారు. అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారిందని ఉదయం స్టేడియంలో వాకింగ్ చేస్తున్న పలువురు వాపోయారు.
– వరంగల్ స్పోర్ట్స్


