గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే బిల్లుల్లో కోత విధిస్తానని బల్దియా కమిషనర్ టి.వెంకన్న కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో ఆయన తనిఖీ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తాగునీటి పైప్‌లైన్ పనులు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ అనుసంధాన పనులు తనిఖీ చేశారు. కాకతీయ యూనివర్సిటీ రోడ్డు రోడ్డు వద్ద ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్‌లైన్‌ల పురోగతిని కమిషన్ పరిశీలించారు. తనిఖీల్లో ఎస్‌ఈ రాజ్‌కుమార్, రాజ్‌కుమార్, రాజారెడ్డి, ఈఈ రవికుమార్, ఎంహెచ్‌ఓ రాజేశ్, డీఈ శ్రీకాంత్, ఏఈలు ఉన్నారు.


