పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలి

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

● వరంగల్‌ డీఐఈఓ శ్రీధర్‌ సుమన్‌

ఖిలా వరంగల్‌: పర్యాటకరంగం దేశ ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని వరంగల్‌ జిల్లా ఇంటర్‌ విద్యాధికారి శ్రీధర్‌ సుమన్‌ పేర్కొన్నారు. పర్యాటకరంగ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని ఆయన సూచించారు. రంగశాయిపేట జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డి.సంపత్‌ అధ్యక్షతన శుక్రవారం పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఐఈఓ హాజరై వేడుకలను ప్రా రంభించి మాట్లాడారు. చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement