పెసర్లకు రికార్డు ధర | - | Sakshi
Sakshi News home page

పెసర్లకు రికార్డు ధర

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

● క్వింటాకు రూ.9,100

● ఏనుమాముల మార్కెట్‌లో

కొత్త పెసర్లకు డిమాండ్‌

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పెసర్లు వచ్చాయి. శుక్రవారం యార్డులో జరిగిన కొనుగోళ్లలో పెసర్లకు ఊహించని ధర లభించింది. గతంలో క్వింటాకు రూ.7వేలు ఉన్న ధర ఒక్కసారిగా క్వింటాకు గరిష్టంగా రూ.9,100 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త పంటకు తొలి రోజే మంచి ధర రావడంతో పెసర్లు సాగు చేసిన రైతుల్లో ఆనందం నెలకొంది.

వికారాబాద్‌లో

కోణార్క్‌ హాల్టింగ్‌

కాజీపేట రూరల్‌: వరంగల్‌, కాజీపేట మీదుగా ప్రయాణించే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా హాల్టింగ్‌ సౌకర్యం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29, 30వ తేదీల వరకు భువనేశ్వర్‌–ముంబాయి (11020) వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఈ హాల్టింగ్‌ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

పోక్సో కేసులో

నిందితుడికి జైలు

ములుగు రూరల్‌: ములుగు జిల్లా మంగపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడు మాతూరి రమేష్‌పై నమోదైన కేసులో ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు కమ్‌ ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి సూర్యచంద్రకళ తీర్పు వెల్ల డించారు. కఠిన కారాగార శిక్షతోపాటు రూ.8,500 జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులైన మమన్‌ భట్‌, సీఐ సూర్య ప్రకాశ్‌, ఎస్‌ఐటీవీఆర్‌ సూరి, కోర్టు మానిటరింగ్‌ అధికారి డీఎస్పీ కిషోర్‌, కో ర్టు లైజనింగ్‌ అధికారి కుమారస్వామి, స్పెషల్‌ పబ్లిక్‌ స్రాసిక్యూటర్‌ రామ్‌ సింగ్‌, సీడీఓలు మౌనిక, మంగీలాల్‌ను ఎస్పీ అభినందించారు.

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

కాశిబుగ్గ: వరంగల్‌ ఎల్‌బీ నగర్‌లోని తారకరామ వీధిలో ఓ ఆటో డ్రైవర్‌ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్వ సుధాకర్‌(53) ఆటో నడుపుతూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతోపాటు కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో నిత్యం ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య మంజుల ఇంతెజార్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిషిత కోరిక నెరవేర్చిన

మంత్రి సీతక్క

హనుమకొండ: వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 18 ఏళ్ల నిరుపేద యువతి కొల్లూరి రిషిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. డీఎండీ వ్యాధి కారణంగా రెండు కాళ్లు పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న రిషితకు రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కతో కలిసి సెల్ఫీ దిగాలనే కోరిక ఉంది. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సీతక్క శుక్రవారం సాయంత్రం రిషిత నివాసానికి వెళ్లి సెల్ఫీ దిగి ఆమె కోరికను నెరవేర్చారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement