గురుకుల పాఠశాలల్లో వసతులు కరువు | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలల్లో వసతులు కరువు

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

పాలకుర్తి టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడంలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. పాలకుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం తెలిసందే. దీంతో శుక్రవారం ఎర్రబెల్లి దయాకర్‌రావు గురుకుల పాఠశాల వద్దకు రావడంతో పోలీసులు, సిబ్బంది ఆయనను లోనికి అనుమతించలేదు. దీంతో పాఠశాల గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, వార్డెన్‌తో మాట్లాడి విద్యార్థినులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ పాఠశాల కార్యదర్శి శారద, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝాతో ఫోన్‌లో మాట్లాడి పర్థితిని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేంవత్‌రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ది ఉంటే ఇప్పటికై న పాఠశాలల ను పట్టించుకుని విద్యార్థినుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పసునూరి నవీన్‌, నల్లా నాగిరెడ్డి, పాము శ్రీనివాస్‌, కమ్మగాని విజయ, బొబ్బల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల భద్రతపై ఆందోళన

గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటనపై బీజేపీ, ఎమ్మార్పీఎస్‌, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురుకులం గేటు ఎదుట శుక్రవారం ఆయా పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్‌, సీపీఎం జిల్లా కమటీ సభ్యుడు చిట్యాల సోమన్న డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఘనటపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్‌, దొంగరి మహేందర్‌, పాకనాటి దామోదర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు చెరుపెల్లి యాదగిరిస్వామ, ఎడవెల్లి సోమచందర్‌, రామచంద్రం, జలగం నరేష్‌ సైతం నిరసన తెలిపారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

గురుకులంలో ఎలుకల కరచిన ఘటనపై మాజీ మంత్రి ఆందోళన

లోపలికి అనుమతించకపోవడంతో

గేటు ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement