గోదావరిలో అస్థికలు కలిపి వస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో అస్థికలు కలిపి వస్తుండగా..

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: బంధువు అస్థికలను భద్రాచలంలోని గోదావరిలో కలిపి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యుల బొలెరో వాహనాన్ని ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలోని మూలమలుపు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పెద్దతండాకు చెందిన దరావత్‌ భద్రు (45) మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడ్వాయి ఎస్సై జగదీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం పెద్దతండాకు చెందిన దరావత్‌ భద్రు ఇటీవల మృతి చెందగా అస్థికలను భద్రాచలంలోని గోదావరిలో కల్పిందుకు కుటుంబ సభ్యులు, బంధువులు బొలెరో వాహనంలో ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని సోమ్లతండాలోని మరికొందరు బంధువులను తీసుకుని ఈనెల 23న భద్రాచలం వెళ్లి ఆస్తికలు కలిపారు. శుక్రవారం తిరిగి వస్తున్న క్రమంలో తాడ్వాయి దాటిన తర్వాత కొండపర్తి సమీపంలోని మూలమలుపు వద్దకు చేరుకోగానే హనుమకొండ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దరావత్‌ భద్రు తీవ్రంగా గాయపడి ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దరావత్‌ సరోజన, దరావత్‌ నెహ్రూ, సక్రు, దరావత్‌ బుజ్జమ్మ, భూక్య జ్యోతి, దరావత్‌ వెంకన్న, దరావత్‌ అనితతోపాటు మరి కొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను తాడ్వాయి ఎస్సై జగదీష్‌, సెకండ్‌ ఎస్సై మధుకర్‌ 108 అంబులెన్స్‌లో ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా బస్సు కండక్టర్‌ రమేష్‌ తలకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు దరావత్‌ నాగేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్‌ తెలిపారు.

బొలెరో వాహనాన్ని

ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఒకరి మృతి, పలువురికి

తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement