‘సూపర్‌’ పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌’ పనుల్లో వేగం పెంచాలి

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎంఓ కార్యాలయం ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని శుక్రవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, కార్యదర్శి కె.మాణిక్‌ రాజ్‌, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పనుల ప్రస్తుత పరిస్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్‌, నీటి సరఫరా అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి, భవన నిర్మాణం పనులను క్షుణ్ణంగా పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను, చేపట్టాల్సిన పనులను ప్రణాళికబద్దంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణం, నాణ్యత, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిన అనంతరం ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేనలు అందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి, కేంఎసీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాసు, వివిధ శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించిన

సీఎంఓ ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement