గార్ల: ‘బాలుడికి ప్రాణభిక్ష పెట్టండి’ అనే శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఉపాధ్యాయులు స్పందించి రూ.11,000 ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల రోహిత్‌కు బ్లడ్ కేన్సర్ సోకింది. రోహిత్ ప్రస్తుతం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో పినిరెడ్డిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన హెచ్‌ఎం సంతు, ఉపాధ్యాయులు భాస్కర్, ఈరా, అనిల్, వీరస్వామి, శోభారాణి, కిరణ్ కలిసి రూ.11,000 నగదును బాలుడి వైద్యం కోసం శుక్రవారం రోహిత్ అక్కకు అందజేశారు. అదే విధంగా మరికొంత మంది ఫోన్‌పే ద్వారా కొంత నగదు పంపించినట్లు బాలుడి తల్లి కుమారి తెలిపారు.
సాక్షి కథనానికి స్పందన
బాలుడి వైద్య ఖర్చులకు రూ.11,000 అందజేత


