రీసర్వేను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వేను వేగవంతం చేయాలి

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

రీసర్వేను వేగవంతం చేయాలి

● హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి ఆదేశించారు. రీసర్వే ప్రక్రియపై తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ ఆర్డీఓ ఎన్‌.వెంకటేశ్‌తో కలిసి రీసర్వే పురోగతిని సమీక్షించారు. సర్వే విభాగంలో సీనియర్‌ సర్వేయర్‌ జీవన్‌ కుమార్‌ సర్వేలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు.

ఐదు గ్రామాల్లో తుది దశకు..

హనుమకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధి ఐదు మండలాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తికాగా, ఆయా గ్రామాల్లో తుది దశ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భీమదేవరపల్లి, కాజీపేట మండలం అమ్మవారిపేట, ధర్మసాగర్‌ మండలం జానకీపురం, ఎల్కతుర్తి మండలం వల్బాపూర్‌, కమలాపూర్‌ మండలం మాధన్నపేట గ్రామాల్లో తుది దశ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన మండలాల్లోనూ రీసర్వే పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement