● నగరంలో చల్లబడిన వాతావరణం
● పంటలకు ప్రాణం పోసిన వాన
హన్మకొండ/వరంగల్ అర్బన్/న్యూశాయంపేట: ఇన్నాళ్లు వర్షాభావ పరిస్థితులతో నగర జనం ఉక్కిరిబిక్కిరైంది. బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి కురిసిన వర్షంతో ఉపశమనం లభించినట్లయ్యింది. రైతులు సాగు చేసిన పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో అత్యఽధికంగా 113.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో 104.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్లలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.ఆనందం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే సమస్యను పరిష్కరించి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని వెల్లడించారు.
అప్రమత్తమైన బల్దియా డీఆర్‌ఎఫ్
భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రోడ్డుపై విరిగిపడిన చెట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డీఆర్‌ఎఫ్ బృందాలు గురువారం వేగంగా తొలగించి రాకపోకలను పునరుద్ధరించాయి. హనుమకొండ ఎకై ్సజ్ కాలనీ, ప్రభుత్వ టీబీ ఆస్పత్రి, దేవన్నపేట ప్రధాన రహదారి, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ బందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ టీబీ ఆస్పత్రి వద్ద విద్యుత్ స్తంభం, తీగలపై పడిన భారీ చెట్లను తొలగించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్‌లింగం నేతత్వంలో జరిగిన ఈ చర్యల్లో ఫైర్ ఆఫీసర్ రాజేశ్వర్‌రావు, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ అప్రమత్తం
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సూపరింటెండింగ్ ఇంజనీర్లు ఎ.ఆనందం, బి.సామ్యానాయక్ తెలిపారు. వర్షం వల్ల తలెత్తే సమస్యలు ఎదుర్కొనుదేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సిద్ధంగా ఉందని వారు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. వినియోగదారులకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 87124 84506, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని కోరారు. వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచామని తెలిపారు. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో వర్షప్రభావం, ప్రస్తుత పరిస్థితులు, గురు, శుక్రవారాల్లో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వర్షపాతం, చెరువులు, వాగులు, వంకలు, రహదారుల పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరి ధిలో నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి ప్రధాన నాలాల్లో వరద సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్ర జల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై కంట్రోల్ రూమ్‌లో అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.


