బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు ఆపండి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు ఆపండి

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

● కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు

మహమ్మద్‌ అయూబ్‌ ఫైర్‌

వరంగల్‌ చౌరస్తా: పేదల ఆస్పత్రి ఎంజీఎంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌ హడావుడి, అబద్ధాలు, నరేందర్‌ గొప్పలు బూటకమని కాంగ్రెస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ విమర్శించారు. వరంగల్‌ లక్ష్మీపురంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పనులు పూర్తి చేయలేదని, స్వలాభం కోసమే నూతన ఆస్పత్రి నిర్మాణం చేపట్టి పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఆస్పత్రిలో కనీస వసతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పిస్తుందని, త్వరలో సేవలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికై నా బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు ఆపకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అయూబ్‌ హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement