బీఆర్‌ఎస్‌ నేతల విషప్రచారాన్ని నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతల విషప్రచారాన్ని నమ్మొద్దు

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

● టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి

మానవతా రాయ్‌

వరంగల్‌ చౌరస్తా: 22–ఏ నిషేధిత జాబితాలోని భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి, వరంగల్‌ – హనుమకొండ సమన్వయకర్త కోటూరి మానవతారాయ్‌ విమర్శించారు. శనివారం వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ ఆయూబ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది ఎకరాల ప్రజల భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చిందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు విషప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 22–ఏ సమస్య కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు అయూబ్‌, ఇనగాల వెంకట్రాంరెడ్డి భూదాన్‌, వక్ఫ్‌ బోర్డు భూముల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, జర్నలిస్టుల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో వరంగల్‌ జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మన్‌ చిలువేరు శ్రీనివాస్‌, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ ఓర్సు తిరుపతి, మహిళ జిల్లా అధ్యక్షురాలు కర్ణాటీ పార్వతమ్మ, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొరివి పరమేష్‌, జిల్లా అధికార ప్రతినిధులు నిమ్మానిశేఖర్‌ రావు, ఎర్ర యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కమలుద్దీన్‌, వర్ధన్నపేట టౌన్‌ అధ్యక్షుడు ఈగ దామోదర్‌, నాయకులు రహమతుల్లా, మహిబూద్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement