● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: తెలంగాణలోని థర్మల్ పవర్ స్టేషన్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరు బృందాలు నేడు(గురువారం) రాష్ట్రంలోని వివిధ పవర్ స్టేషన్లను సందర్శించనున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి తాను భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను సందర్శించనున్నట్లు చెప్పా రు. పవర్ స్టేషన్‌లో ప్రస్తుత పరిస్థితులు, అక్క డ జరుగుతున్న పరిణామాలను స్వయంగా ప రిశీలించి వాస్తవాలు తెలుసుకుంటామని పే ర్కొన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లకు సంబంధించి వెలువడుతున్న వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పూర్తి వివరాలను ప్రజల ముందుంచుతామని ఎమ్మెల్యే తెలిపారు.
బందోబస్తుకు వెళ్లిన ఎస్‌ఐ దుర్మరణం
● హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
● ఇటీవల కొత్తగూడెం నుంచి
మహబూబాబాద్‌కు బదిలీ
చోరీ బైక్‌పై దర్జాగా షికారు..
● అదాలత్ సెంటర్ వద్ద వాహనం గుర్తింపు
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14వ తేదీన ఉదయం బైక్ చోరీ జరిగింది. రంగశాయిపేట గణేశ్‌నగర్ కాలనీకి చెందిన రాపాక శ్రీకాంత్ వాకింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో గవిచర్ల క్రాస్ రోడ్డు పై బైక్ పార్క్ చేసి టీ తాగుతున్నాడు. అనంతరం బైక్ వద్దకు వెళ్లి చూడగా.. ఆ స్థలంలో కనిపించలేదు. దుండగుడు క్షణాల్లో బైక్ (ఏపీ 20 ఏఎన్4366) అపహరించాడు. ఈ ఘటనపై బుధవారం మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శ్రీకాంత్ తెలిపారు. చోరీ అనంతరం ఓ పురుషుడు బైక్ నడుపుతుండగా, వెనుక ఓ మహిళ కూర్చుని ప్రయాణిస్తున్న దృశ్యం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అదాలత్ సెంటర్ వద్ద చోరీ చేసిన బైక్‌పై ఇద్దరు అనుమానితులు ప్రయాణిస్తూ సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని పోలీసులు పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఫిర్యాదుదారు శ్రీకాంత్ పేర్కొన్నాడు.


