క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

జనగామ రూరల్‌ : క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని, ఈ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడొచ్చని జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి గౌసియా బేగం అన్నారు. బుధవారం జనగామలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో అండర్‌–14, 17 విభాగాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి బాలబాలికల ఫుట్‌బాల్‌ క్రీడల ఎంపికలు నిర్వహించారు. సుమారు 250 మంది బాలురు, 150 మంది బాలికలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికలకు ఎంపికై , తమ ప్రాంతం, తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈపోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంపికల్లో పాల్గొంటారని జిల్లా పాఠశాల సమైక్య క్రీడల కార్యదర్శి జాటోత్‌ గోర్‌ సింగ్‌ తెలిపారు. అజ్మీరా కిషన్‌ నాయక్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ నరేందర్‌, రవీందర్‌, దాస్రూనాయక్‌, ప్రేమ్‌ కుమార్‌, రవి, బండారి కిరణ్‌ కుమార్‌, లచ్చిరాం, వీర్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి గౌసియా బేగం

జనగామలో ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్‌బాల్‌ ఎంపికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement