‘ఎల్‌ఐసీ’ స్కాలర్‌షిప్‌.. | - | Sakshi
Sakshi News home page

‘ఎల్‌ఐసీ’ స్కాలర్‌షిప్‌..

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

బచ్చన్నపేట : పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య నభ్యసించడానికి అవస్థలు పడకుండా భారతీయ జాతీయ బీమా (ఎల్‌ఐసీ ) సంస్థ అండగా నిలుస్తూ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రతీ సంవత్సరం ఒక్కో విద్యార్థికి రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ క్రమంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ పథకం కింద అత్యంత ప్రతిభావంత విద్యార్థులకు అందించనున్న ఆర్థిక సాయం కోసం తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ కేటగిరీ విద్యార్థులు అర్హులు..

● జనరల్‌ కేటగిరీ విద్యార్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2026–27 విద్యా సంవత్సరంలో డిగ్రీ లేదా ఏదైనా వృత్తి విద్యా కోర్సు మొదటి సంవత్సరంలో ప్రదేశం పొందిన వారు అర్హులుగా పరిగణిస్తారు.

● రిజర్వ్‌డ్‌ కేటగిరీ విద్యార్థులు పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 2026–27 విద్యా సంవత్సరానికి ఐటీఐ, వృత్తి విద్య లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆదాయ వివరాలు..

● దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.50 లక్షలు మించకూడదు.

● దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 30 వరకు ఉంది.

స్కాలర్‌ షిప్‌ ఇచ్చేది ఇలా..

ఎంబీబీఎస్‌ బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 50 వేలు, బీఈ, బీటెక్‌, బీఆర్చ్‌ విద్యార్థులకు సంవత్సరానికి రూ. 40 వేలు, ఇతర డిగ్రీ, డిప్లొమా వారికి రూ. 20 వేలు, ఇంటర్మీడియట్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున స్కాలర్‌ షిప్‌ అందిస్తారు. ప్రతీ సంవత్సరం రెండు విడతలుగా నేరుగా నెఫ్ట్‌ ద్వారా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ స్కాలర్‌ షిప్‌ పీజీ లేదా తత్సమాన కోర్సు విద్యార్థులకు వర్తించదు.

ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

సూచిస్తున్న కార్పొరేషన్‌ ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement