నగరాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం | - | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

నగరాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారం అందించనుందని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశమమయ్యారు. ఎంపీ కడియం కావ్య, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ‘కుడా’ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్నతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం అహ్లూవాలియా ఖనిజో, అపూర్వ సెన్వి, నేహా ప్రవాస్‌ కుమార్‌ మిశ్రా, వెంకటరావు భయానతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా వారు ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి చర్చించారు. అశోకా జంక్షన్‌, భద్రకాళి ఆలయ ప్రాంతాల్లో మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌, సెంట్రల్‌ ప్లాజా పునర్నిర్మాణం, రోప్‌వే, సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌, సమగ్ర స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ వ్యవస్థ తదితర ప్రాజెక్టుల గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు అధికారులు వివరించారు. సమావేశంలో కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అధికారులు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement