హన్మకొండ: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, సెక్రటరీ జనరల్ బక్క దానయ్య, నాయకులు వారికి వినతిపత్రం అందించారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు పి.రామస్వామి, దయానంద్, జిల్లా శంకర్, చాట్ల సుధాకర్, వెంకటేశ్వరరావు, సంతోష్, కృష్ణ, రవి, ఉప్పలయ్య, భాస్కర్ పాల్గొన్నారు.


