అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రిజిస్ట్రార్‌ వి రామచంద్రం, వివిధ విభాగాల ఆచార్యులతో కలిసి యూనివర్సిటీ క్యాంపస్‌లో పద్మాక్షి మహిళా హాస్టల్‌ భవనంలో నిర్మిస్తున్న డైనింగ్‌ హాల్‌, క్యాంటీన్‌ పక్కన రోడ్డు వద్ద నిర్మిస్తున్న సెంట్రల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌సెంటర్‌ భవనం నిర్మాణం, ఇంజనీరింగ్‌ కళాశాల సెమినార్‌హాల్‌, కంప్యూటర్‌ సెంటర్‌ పరిశీలించారు. ఆయా పనులు నాణ్యతతోపాటు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే, కెహబ్‌లో కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. రూసానోడల్‌ అధికారి ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి, పూర్వ అభివృద్ధి అఽధికారి ఎన్‌.వాసుదేవరెడ్డి, అభివృద్ధి అధికారి వై. వెంకయ్య, యూనివర్సిటీ ఇంజనీర్‌ శంకరయ్య, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌, హాస్టళ్ల డైరెక్టర్‌ పి. శ్రీనివాస్‌, కేయూ అవెన్యూప్లాంటేషన్‌ ఇన్‌చార్జ్‌ బి. వెంకటగోపినాథ్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమణ, పబ్లికేషన్‌ సెల్‌ విభాగం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement