● అదనపు కలెక్టర్ రవి
హన్మకొండ అర్బన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉండి నోటీసులు అందుకున్న ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీ, సమయంలో విచారణ కేంద్రానికి హాజరై ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి కోరారు. కలెక్టరేట్‌లో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈనెల 16 నుంచి అక్టోబర్ 7 వరకు, వాటి విచారణ గడువును అక్టోబర్ 15 నుంచి నవంబర్ 5 వరకు ఎన్నికల సంఘం పొడిగించిందన్నారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రకటించనున్నట్లు తెలి పారు. పరకాల, వరంగల్ పశ్చి మ నియోజకవర్గా ల ఈఆర్‌ఓలు డీఎస్ వెంకన్న, వెంకటేశ్, హనుమకొండ ఏఈఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్ పాల్గొన్నారు.


