ఖిలా వరంగల్: వరంగల్ నగరంలోని ఓ ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కేంద్రంలో కాలం చెల్లిన నిత్యావసర సరుకులు బయటపడటం కలకలం రేపింది. కరీమాబాద్ చెందిన నాగరాజు అనే వ్యక్తికి ఆన్‌లైన్ డెలివరీలో గడువు ముగిసిన జ్యూస్ రావడం.. దానిని తాగి అనారోగ్య గురయ్యాడు. వైద్య చికిత్స అనంతరం ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. గురువారం రాత్రి నగరంలోని ఓ ప్రముఖ డెలివరీ కేంద్రంపై తనిఖీలు చేశారు. నాగరాజుకు పంపిన జ్యూస్‌తోపాటు మరిన్ని గడువు ముగిసిన సరుకులను గుర్తించినట్లు సమాచారం. అధికారులు వాటిని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. కాలం చెల్లిన సరుకులను నిల్వ ఉంచడం, ఆన్‌లైన్ డెలివరీ చేయడంపై సంబంధిత నిర్వాహకుల మీద చట్టరీత్యా చర్యలకు తీసుకుంటామని ఫుడ్‌సేఫ్టీ ఆధికారి కృష్ణమూర్తి, ఇన్‌స్పెక్టర్ మౌనిక తెలిపారు. అదేవిధంగా హనుమకొండలోని పలు హోటళ్లలో కూడా తనిఖీలు చేశారు. పలు హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి ఆహార పదార్థాల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.
ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కేంద్రంలో
వెలుగులోకి..


