రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఆరెపల్లి శివా రు ములుగు రోడ్డుపై అగ్రికల్చర్‌ క ళాశాల సమీపంలో ఈనెల 8న తెల్ల వారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండాకు చెందిన వాంకుడోతు అశోక్‌ (25) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్‌, సోనియా దంపతులు హనుమకొండలోని జులైవాడలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 7న ఫొటో షూట్‌ ఉందని చెప్పిన అశోక్‌.. తన స్నేహితుడు సోహెల్‌ అంబులెన్స్‌లో వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం సోనియా భర్త అశోక్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో భర్త కనిపించడం లేదని 8వ తేదీన సోనియా సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం ఆరెపల్లి గ్రామ శివారు అగ్రికల్చర్‌ కళాశాల సమీపాన బైక్‌ పడిపోయి ఉండగా.. ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడని సోనియాకు ఓ వ్యక్తి కాల్‌ చేసి చెప్పాడు. దీంతో ఆమె వెంటనే ఘటనాస్థలికి చేరుకుని భర్త అశోక్‌ మృతదేహంగా గుర్తించింది. ఫొటో షూట్‌కు వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్న క్రమంలో రోడ్డు పక్కన గ్రానెట్‌ను ఢీకొని మృతి చెందినట్లు రోదిస్తూ తెలిపింది. ఈ ఘటనపై మృతుడి భార్య సోనియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజి సురేశ్‌ తెలిపారు.

చికిత్స పొందుతున్న హోంగార్డు మృతి

మామునూరు: వరంగల్‌ – ఖమ్మం జాతీ య రహదారిపై టీజీఎస్పీ నాలుగో బెటా లియన్‌ వద్ద రోడ్డు దాటుతున్న నాలుగో బెటాలియన్‌ హోంగార్డు వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారానికి చెందిన గట్టి కొప్పుల సుధాకర్‌ (56)ను కా రు ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, ము గ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

రోడ్డు పక్కన మృతదేహం

ఆలస్యంగా గుర్తింపు

సుబేదారి పోలీస్‌

స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement