జనగామ రూరల్: చెల్లుబాటయ్యే డ్రగ్ లైసెన్స్ లే కుండా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్న అ ర్హత లేని గ్రామీణ వైద్యుడి(ఆర్‌ఎంపీ)పై గురువారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారి బాలకృష్ణ తెలిపారు. జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్‌లో నిర్వహించిన తనిఖీల్లో విక్రయానికి నిల్వ ఉంచిన 40 రకాల ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ రూ.2,1 0,540గా ఉంటుందని వెల్లడించారు. డ్రగ్ ఇన్‌స్పెపెక్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ జోనన్‌్ సహాయ సంచాలకులు రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో జనగామ, భూపాలపల్లి జిల్లాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఏలె బాలకృష్ణ, పి.పావని సహకారంతో గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ పన్నీరు రమేశ్ ఇంట్లో తనిఖీ నిర్వహించారు. ఇందులో చెల్లుబాటయ్యే డ్రగ్ లైసెన్స్ లేకున్నా నిల్వ చేసిన 40 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, రక్తపోటు నియంత్రణ మందులు, ఇతర ఔషధాలు, యాంటీ అల్సర్ మందులు, దగ్గు సిరప్‌లు, నొప్పి నివారణ మం దులు తదితర ఔషధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రమేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వివరించారు. తెలిపారు. లైసెన్స్ లేకుండా ఔషధాలు నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
రూ.2.10 లక్షల విలువైన మందులు స్వాధీనం
అర్హత లేని గ్రామీణ వైద్యుడిపై కేసు


