రఘునాథపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో బాలికలు చదువుతోపాటు సమకాలీన 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని రిఫినిటీ ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ శార్వాణి విద్యాధరణి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ఖిలాషాపూర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్‌ఎం భారత రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన బాలికల రోల్ మోడల్ ఇంటరాక్షన్ అండ్ మెంటారింగ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ గైడెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాలు సాధిస్తున్న పురోగతిని వివరించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవా లని సూచించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని రేష్మ, ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులు ఎస్. విమలాదేవి, ఎం.రాధ, శాగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
రిఫినిటీ ఏఐ సీఈఓ శార్వాణి విద్యాధరణి


