స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి

హసన్‌పర్తి: అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మండిపడ్డారు. స్పీకర్‌పై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్‌ హసన్‌పర్తి శాఖ ఆధ్వర్యంలో సోమవారం హసన్‌పర్తి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. అత్యున్నత స్పీకర్‌ పదవిలో ఉన్న వ్యక్తిపై బాధ్యతారహితంగా, అవమానకరంగా మాట్లాడడం బీఆర్‌ఎస్‌ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. తాతా మధు తక్షణమే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, కిరణ్‌, బల్సుకూరి శ్రీనివాస్‌, పెద్దమ్మ నర్సింహరాములు, ఆరెల్లి వెంకటస్వామి, రాజు, మధు, సురేశ్‌, బుచ్చిరెడ్డి, రుగ్వేద్‌రెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నాయకుల నిరసన

కాశిబుగ్గ: శాసనసభ స్పీకర్‌ స్థానంలో ఉన్న దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో కాంగ్రెస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అయూబ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అనంతరం మధు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనపై బీఆర్‌ఎస్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కొరివి పరమేష్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement