వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికలకు ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. దాదాపుగా 500 మంది బాలబాలికలు హాజరైనట్లు వరంగల్ జిల్లా సెక్రటరీ అబ్దుల్లా ఖాన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఇందులో ప్రతిభకనబర్చిన బాలబాలికల జట్లు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొంటారని అబ్దుల్లా ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ సంఘం హనుమకొండ జిల్లా సెక్రటరీ ఆకుల సారంగపాణి, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీరామ్ రెడ్డి, బాధ్యులు ముఖర్జీ, హసన్, కక్కెర్ల మల్లికార్జున్ గౌడ్, ఇనాయత్, గోగు నారాయణ, నాగెల్లి రవీందర్, శ్రీకాంత్, శ్రవణ్, వ్యాయామ ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.


