● మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
న్యూశాయంపేట/వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆరోపించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, వరంగల్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


