● ఉప రవాణా కమిషనర్ అఫ్రీన్ సిద్ధిఖీ
హసన్‌పర్తి: బాల్యం నుంచే విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఉపరవాణా కమిషనర్ అఫ్రీన్ సిద్ధిఖీ అన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల స్థాయిలో రోడ్డు భద్రత కార్యక్రమాల అమలుపై విశేష కృషి చేసిన ఎంఈఓలను రోడ్డు రవాణశాఖ ఆధ్వర్యంలో చింతగట్టులోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రశంస పత్రాలతో సత్కరించారు. కార్యక్రమానికి ఉప రవాణా కమిషనర్ అఫ్రీన్ సిద్ధిఖీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉప రవాణశాఖ కమిషనర్ సురేశ్‌రెడ్డి, డీఈఓ ఎల్వీ గిరిధర్‌రాజ్‌గౌడ్, జిల్లా రవాణాధికారి జనార్దన్‌రెడ్డి, ఎంవీఐలు కిరణ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


