విద్యార్థుల సమస్యలపై శ్రద్ధ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలపై శ్రద్ధ ఏదీ?

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

హన్మకొండ: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాజకీయ నిరసనలు, కార్యక్రమాలపై చూపిస్తున్న శ్రద్ధను విద్యార్థుల సమస్యలపై కూడా చూపించాలని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి సుబేదారిలోని కలెక్టరేట్‌ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థి ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. పాలిటెక్నిక్‌ విద్యకు సంబంధించిన జీఓ 97ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక వందలాది కా లేజీలు ఆర్థిక ఇబ్బందులతో మూసివేత దిశగా వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు, నాయకులు వీర భిక్షపతి, శ్రీశైలం, రాణి, మాధవి, అనిల్‌ నాయుడు, సుమన్‌ పాల్గొన్నారు.

రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు

న్యాయం చేయాలి..

కాజీపేట రూరల్‌ : కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ నిర్మా ణానికి భూములిచ్చిన నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కాజీపే ట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ భూ నిర్వాసితులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లాతూరు, మ హారాష్ట్ర రైల్వే యూనిట్‌లో మాదిరి కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులు సంజయ్‌, కిషన్‌రెడ్డిని కలిసి రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల సమస్యలు వివరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు. నాయకులు వెంకటేశ్వర్లు, భిక్షపతి, శ్రీ కాంత్‌, మాధవి, వనజ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత్రి కవిత, నాయకులు, విద్యార్థులు

రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఎదుట భూ నిర్వాసితులతో కలిసి నినాదాలు చేస్తున్న కవిత

తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement