హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి సత్వర పరిష్కారం చూపెట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కార చర్యలపై కలెక్టర్.. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మండల స్థాయి ప్రజావాణిని సజావుగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రజావాణిలో జిల్లా స్థాయిలో 127, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 47, మండల స్థాయిలో 187 కలిపి మొత్తం 361 వినతులు అందాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, డీఆర్‌ఓ శ్రీనివాస్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులను తక్షణమే పరిష్కరించాలి:
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. మొత్తం 166 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


