గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ గ్రీవెన్స్ సెల్‌కు అందిన ఫిర్యాదులపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని కమిషనర్ టి.వెంకన్న అధికారులను, ఉద్యోగులను హెచ్చరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమస్యాత్మక దరఖాస్తులైతే నివేదికలు అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


