మహబూబాబాద్ రూరల్ : ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. రసాయన రహిత సాగుతో నేలకు ఆరోగ్యం, పర్యావరణ పరి రక్షణ, రైతులకు ప్రయోజనాలు, నాణ్య మైన పంట, ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యం శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, డీఏఓ విజయచంద్రను అభినందించి వ్యవసాయ విస్తరణ అధికారి పున్నమికి ఫోన్ చేసి మాట్లాడారు. ‘సాక్షి’ లో ప్రచురితమైన సేంద్రియ వ్యవసాయ కథనం చూశానని, యూరియా, డీఏపీలు వేయకుండా రై తులు ఎలా దిగుబడి తీస్తున్నారని అడిగారు. జాతీ య ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా ఈదులపూసపల్లి క్లస్టర్ ఎంచుకుని 125 మంది రైతులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి, ఒక్కో రైతు కనీసం ఎకరం చొప్పున సేంద్రియ వ్యవసాయం చేసేలా మళ్లిస్తున్నామని ఏఈఓ పున్నమి మంత్రితో చెప్పారు. వరి సాగు సమయంలో రైతులు దమ్ములో పశు ఎరువు, వర్మి కంపోస్ట్ నేలలో కలియ దున్నుతారని, పైరు పెరిగిన తర్వాత పురుగుల, తెగుళ్ల నివారణకు జీవామృతం పిచికారీ చేస్తారని వివరించారు. తా ము జీవామృతం, పంచగవ్య, ఘనజీవామృతం, అగ్నిహస్త్రం, నీమాస్త్రం లాంటి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తామని ఏఈఓ చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ రైతులకు ఏమైనా ఇచ్చారా అని మంత్రి అడుగగా సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించామని, జీలుగ పొలాలలో సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవడానికి, జనము మిరప వేసే ముందు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవడానికి సబ్సిడీలో అందజేశామని మంత్రికి చెప్పారు.
రైల్వేగేట్ ప్రాంతంలో
చోరీల కలకలం
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతంలో వ రుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వేర్వేరు కాలనీల్లో వరుస చోరీలు జరిగా యి. నాలుగు ఇళ్లలో సుమారు రూ.2.17 లక్షల నగదు, 76.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 97 గ్రాముల వెండి వస్తువులు అపహరించిన ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాలను క్లూస్ టీంతో ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించారు. నాలుగు చోట్ల ఒకే వ్యక్తి చోరీలకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కాళేశ్వరానికి కృష్ణశిల రాయి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం నిర్మాణం రాతితో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గురజపల్లి నుంచి కృష్ణశిల రాయిని తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాతి నిర్మాణం కోసం ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం. కానీ, శిల్పాలకు సంబంధించిన కొలతలు రాలేదని తెలిసింది.


