అందుబాటులో నీటి నాణ్యత యూనిట్లు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో నీటి నాణ్యత యూనిట్లు

Aug 18 2026 9:14 AM | Updated on Aug 18 2026 9:14 AM

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగర ప్రజలకు మరింత నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధునాతన నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను (వాటర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టం) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి. వెంకన్న తెలిపారు. సోమవారం బల్దియా కౌన్సిల్‌హాల్‌ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ పాల్గొని నీటి నాణ్యత పర్యవేక్షణ విధానాన్ని పరిశీలించారు. నగరంలోని ప్రతా పరుద్ర, కేయూసీ, వడ్డేపల్లి ఫిల్టర్‌ బెడ్లలో వా టర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టం యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌పుట్‌, ఔట్‌పుట్‌ దశల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ అధునాతన వ్యవస్థలు ఉపయోగపడతా యని తెలిపారు. అమృత్‌ 2.0 ఫేజ్‌–2లో భాగంగా ఐనెట్‌ ఆక్వా సొల్యూషన్‌ రూపొందించిన ‘ఆన్‌లైన్‌ఫ్లోరైడ్‌ క్వాలిటీ మానిటరింగ్‌’ సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని కమిషనర్‌ తెలిపారు. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ఎస్‌బీఐ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన శాలరీ ప్యాకేజీ అవగాహన సదస్సులో కమిషనర్‌ మాట్లాడారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈలు రవికుమార్‌, మహేందర్‌, మాధవీలత, డీఈలు, ఏఈలు, పాల్గొన్నారు.

మండలస్థాయి ప్రజావాణికి స్పందన

న్యూశాయంపేట: ఎంపీడీఓ నోడల్‌ అధికారిగా మండల స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందించారు. నెక్కొండలో 13, గీసుకొండ 8, నర్సంపేట 15, నల్లబెల్లి 8, ఖానాపురం 20, పర్వతగిరి 38, సంగెం 20, వర్ధన్నపేట 18, రాయపర్తి 17, చెన్నారావుపేట 7, దుగ్గొండిలో 6 వినతులు (మొత్తం 170) స్వీకరించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement