హన్మకొండ అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరి ష్కార చర్యలను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప రిష్కార చర్యలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం స మీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టల్‌లో నమోదైన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిశీలించాలన్నారు. సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, టౌన్‌ప్లానింగ్ అధికా రి జ్యోతి, అసిస్టెంట్ సిటీప్లానర్లు నస్రీన్‌భాను, ప్రశాంత్, ఇరిగేషన్ అధికారి వెన్నెల పాల్గొన్నారు.
కేటాయించిన డబుల్‌బెడ్‌రూం
ఇళ్లలో నివసించాలి
కాజీపేట అర్బన్: కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో వెంటనే నివసించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. న్యూశాయంపేటలోని 19 బ్లాకుల్లో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఆరు బ్లాక్‌లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉందని మిగతా బ్లాక్‌లకు కూడా వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. హౌసింగ్ పీడీ సిద్ధార్థ్‌నాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


