ప్రగతి పరుగులు | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పరుగులు

Aug 17 2026 7:41 AM | Updated on Aug 17 2026 7:41 AM

● సంక్షేమ పథంలో ప్రగతి పరుగులు

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● సంక్షేమ పథంలో

హన్మకొండ అర్బన్‌: ప్రజా ప్రభుత్వంలో హనుమకొండ జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. పలు పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం శకటాల ప్రదర్శన, ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. ఈసందర్భంగా రాష్ట్రం, జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ లక్ష్యాలు మంత్రి తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు.

జంట నగరాలపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌, హనుమకొండ జంట నగరాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వివిధ మౌలిక వసతులు వేగవంతం చేస్తోందని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తాగునీరు, భూగర్భ డ్రెయినేజీ, రహదారులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, మామునూరు విమానాశ్రయం, పర్యాటక అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ఆయన వివరించారు. గ్రేటర్‌ వరంగల్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతీరంగంలో గణనీయ అభివృద్ధి..

● ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ద్వారా ధర్మసాగర్‌, చలివాగు ప్రాజెక్టులను నింపి వచ్చే ఏడాది వరకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

● 2057 జనాభా అవసరాలకు అనుగుణంగా రూ.5,300 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టామని తెలిపారు.

● రూ.572 కోట్లతో 45 కిలోమీటర్ల పొడవునా 200 అడుగుల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

● హనుమకొండ–కాజీపేట రూ.78 కోట్లు, ఫాతిమా–మామునూరు రూ.68 కోట్లతో చేపట్టిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

● ‘కుడా’ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయం కోసం 950 ఎకరాల స్థలాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి అప్పగించామని వెల్లడించారు.

● జిల్లాలో నాలుగు తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, రెండు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

● పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు.

● భద్రకాళి మాడవీధుల పనులు తుది దశకు చేరాయని పేర్కొన్నారు.

● వంగరలో పీవీ.నరసింహారావు విజ్ఞాన వేదికకు రూ.7 కోట్లు, కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌కు రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

● మహిళా రుణాలు–స్మార్ట్‌ రేషన్‌న్‌ కార్డులు: జిల్లాలో 1,445 మహిళా సంఘాలకు రూ.136 కోట్ల సీ్త్రనిధి, బ్యాంకు అనుసంధాన రుణాలు అందించామని తెలిపారు. శనివారం నుంచే జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభమైందని మంత్రి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్‌ రవి, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికా రులు, సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హనుమకొండ పరేడ్‌ గ్రౌండ్స్‌లో

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

జాతీయ పతాకావిష్కరణ, జిల్లా ప్రగతి నివేదిక వివరించిన మంత్రి

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సమరయోధులకు సన్మానం..

ఉత్తమ ఉద్యోగులకు సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement