● విజయ డెయిరీ, వరంగల్ డీడీ ధన్‌రాజ్
హన్మకొండ చౌరస్తా: డెయిరీలోని మిషనరీలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణం, పాల శీతలీకరణ ప్రక్రియలో అంతరాయం వల్లనే పాలు విరిగినట్లు గుర్తించామని విజయ డెయిరీ వరంగల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ ధన్‌రాజ్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన ‘విరిగిన విజయ డెయిరీ పాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై డెయిరీ డీడీ స్పందించారు. శనివారం హహనుమకొండ అలంకార్ జంక్షన్ సమీపంలో విజయ డెయిరీ కార్యాలయంలో డెయిరీ పరిధిలో పాలు సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, పాడి రైతుల సంఘం బాధ్యులు, డెయిరీ ఉద్యోగులతో డీడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత మిషనరీ పూర్తిగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు, సాంకేతిక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విజయ డెయిరీ వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని, మార్కెట్‌లో పాల సరఫరా, నిల్వ, శీతల సరఫరా వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు.


