అధికారులు బాధ్యతగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు బాధ్యతగా పనిచేయాలి

Aug 17 2026 7:41 AM | Updated on Aug 17 2026 7:41 AM

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. శనివారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన దేశభక్తి, సేవా స్ఫూర్తిని ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో జీడబ్ల్యూఎంసీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఉత్తమ అధికారులు సిబ్బందికి కమిషనర్‌తో కలిసి ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, ఎస్‌ఈ రాజ్‌ కుమార్‌, సీఎంహెచ్‌ఓ రాజారెడి, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, అకౌంట్స్‌ అధికారి శివలింగం డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, ఇన్‌చార్జ్‌ సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌లు బిర్రు శ్రీనివాస్‌, ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌ బాబు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌లోని టౌన్‌ హాల్‌లో బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు పబ్లిక్‌ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

గ్రేటర్‌ వరంగల్‌ ప్రత్యేకాధికారి,

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement