శక్తి పాలసీని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

శక్తి పాలసీని రద్దు చేయాలి

Aug 15 2026 7:23 AM | Updated on Aug 15 2026 7:23 AM

స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

ఎంజీఎం జంక్షన్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల నిరసన

వరంగల్‌ చౌరస్తా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలిటెక్నిక్‌ విద్యను కుట్రపూరితంగా శక్తి పాలసీ ద్వారా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని, ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్‌ ఎంజీఎం నుంచి పాలిటెక్నిక్‌ కాలేజీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన శక్తి పాలసీని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

కాజీపేట అర్బన్‌ : హనుమకొండ జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలు 2026–27 సంవత్సరానికిగాను నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మికుల సంక్షేమ దవాఖానా డాక్టర్‌ బి.సురేష్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈనెల 31వ తేదీ వరకు, ఇంటర్‌ ఆపై చదువుతున్న వారు అక్టోబర్‌ 31వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement