రొచ్చు రొచ్చు | - | Sakshi
Sakshi News home page

రొచ్చు రొచ్చు

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

రొచ్చు రొచ్చు

వరంగల్‌ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌ ఆవరణ అపరిశుభ్రతకు కేంద్రంగా మారింది. అసలే వర్షాకాలం. ఓ వైపు ఈగలు, దోమల మోత, మరో వైపు విచ్చలవిడిగా సంచరించే పశువులు. అడుగేస్తే జారిపడేలా బురద.. వీటన్నింటి నడుమ కూరగాయల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు. కొందరైతే వామ్మో కూరగాయల మార్కెట్‌ అంటూ.. అక్కడికి వెళ్లడానికే జంకుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మార్కెట్‌ బయటి వాతావరణం సైతం అపరిశుభ్రంగా మారింది. వ్యాపారులు విక్రయించగా మిగిలిన వ్యర్థాలు, మిగిలిన, పాడైపోయిన కూరగాయలు పడేస్తుండడంతో మార్కెట్‌ చుట్టుపక్కల దుర్వాసన వస్తోంది. బల్దియా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement