హెచ్‌ఐవీపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహన అవసరం

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

హెచ్‌ఐవీపై అవగాహన అవసరం రేపు స్మారకోపన్యాసం రోగులకు పరీక్షే!

హన్మకొండ: యువతకు హెచ్‌ఐవీపై అవగాహన అవసరమని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధ వారం హనుమకొండలోని ప్రభుత్వ టీబీ ఆస్పత్రిలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, లైంగిక సంక్రమణ వ్యాధులపై విస్తృత అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డాక్టర్‌ అప్పయ్య మాట్లాడుతూ.. హెచ్‌ఐవీకి సంబంధించిన సమాచారం, సేవలను జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ రూపొందించిన ‘బ్రేక్‌ ఫ్రీ’ యాప్‌ ద్వారా యువత పొందవచ్చని తెలిపారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మదన్‌న్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి అక్టోబర్‌ 12 వరకు జిల్లాలోని 181 గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ.శ్రీనివాస్‌రావు, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవి, ఆర్‌ఎంఓ వెంకటరమణ, డీటీసీఓ ప్రదీప్‌రెడ్డి, అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కేయూ ఫార్మసీ కళాశాల దివంగత ప్రొఫెసర్‌ వై.మధుసూధన్‌రావు తొలి స్మారకోపన్యాసాన్ని ఈనెల 14న ఉదయం 11 గంటలకు క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు బుధవారం కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని వీసీ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. కేయూ ఫార్మసీ కళాశాల రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రామ్‌బహు ‘ఇన్నోవేటివ్‌ నానో డ్రగ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌’ అంశంపై స్మారకోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొనాలని రిజిస్ట్రార్‌ కోరారు.

ఎంజీఎంలో సీబీపీ టెస్ట్‌ లేక

ప్రైవేట్‌కు పరుగులు

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్‌ గ్రూపింగ్‌ టెస్ట్‌ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యసవర విభాగంతో పాటు సెంట్రల్‌ ల్యాబ్‌లో ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్‌ గ్రూప్‌ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్‌ లేకపోవడం వల్ల టెస్ట్‌లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషెంట్‌ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బి, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషెంట్లు ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ప్రైవేట్‌గా తీసుకొచ్చిన బ్లడ్‌ గ్రూప్‌ రిపోర్ట్‌ను వైద్యులు అంగీకరించడం లేదని పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్‌ గ్రూప్‌ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, అడ్వాన్స్‌గా కెమికల్స్‌ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement