పకడ్బందీగా పన్ను వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పన్ను వసూలు చేయాలి

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

పకడ్బందీగా పన్ను వసూలు చేయాలి

హన్మకొండ/వరంగల్‌ అర్బన్‌: పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్నతో కలిసి కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ట్యాక్సేషన్‌, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిళ్ల వారీగా ఆస్తి పన్ను వసూళ్లు, కొత్త నిర్మాణాల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు.

అధికారులతో సమీక్ష

పకడ్బందీగా పన్నులు వసూలు చేసి నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులకు సూచించారు. బుధవారం బల్దియా కార్యాలయంలో పన్నుల వసూళ్లు, పెండింగ్‌ బకాయిలపై ఆయన సమీక్షించారు. అనంతరం చేయూత పింఛన్ల దరఖాస్తుల పురోగతిని కమిషనర్‌ వెంకన్న సమీక్షించారు. సర్కిళ్ల వారీగా దరఖాస్తుల ప్రక్రియ గురించి డిప్యూటీ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు.

పరిశుభ్రత పాటించాలి

పేదలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రధాన వంటశాలను కమిషనర్‌ పరిశీలించారు. నాణ్యత, పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వరంగల్‌ కలెక్టరేట్‌లో ప్లాంటేషన్‌ పనులు పరిశీలించారు. ఆయా సమావేశాల్లో అదనపు కమిషనర్‌ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్‌, పన్నుల అధికారి రామకృష్ణ, ఐటీ మేనేజర్‌ రమేశ్‌, ఆర్‌ఓలు శ్రీనివాస్‌, బాకం సంతోశ్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి

చాహత్‌ బాజ్‌పాయ్‌

మెరుగైన సేవలందించండి:

బల్దియా కమిషనర్‌ వెంకన్న

అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement