విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్‌నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
కలెక్టరేట్ బంగ్లా ఎదుట జైల్ భరో..
హన్మకొండ అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం సుబేదారి కలెక్టర్ బంగ్లా ఎదుట సోమవారం జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. రాస్తారోకోతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అరెస్టు చేసిన వారిని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, అక్కడే బైఠాయించి మరో అరగంట పాటు ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి హంసారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


