ఆర్థిక సాయమందించినా నిలవని ప్రాణం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సాయమందించినా నిలవని ప్రాణం

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

ఆర్థిక సాయమందించినా నిలవని ప్రాణం

వైద్యం కోసం విరాళాల సేకరణ..

ఆలోపే మృతి

వీధిన పడిన ఆటోడ్రైవర్‌ కుటుంబం

హసన్‌పర్తి: మానవత్వంతో స్పందించారు. తోచినంత ఆర్థిక సాయం చేశారు. ఒక ప్రాణం నిలబడాలని ప్రయత్నించారు. ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, అనారోగ్యం.. ఆ ఆటో డ్రైవర్‌ను కబలించింది. చికిత్స పొందుతున్న అతడు మృతి చెందాడు. హసన్‌పర్తిలో విషాధచాయలు అలుముకున్నాయి. హసన్‌పర్తికి చెందిన చిలగాని భిక్షపతి(38) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య రాధిక, కుమారుడు మీరాక్‌ను పోషించుకుంటున్నాడు. భిక్షపతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబీకులు విరాళాల సేకరణ కోసం ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. దాతలు ముందుకు వచ్చి రూ.ఆర్థిక సాయం చేశారు. భిక్షపతి పరిస్థితిని స్థానిక నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, దీకొండ భిక్షపతి, కనపర్తి కిరణ్‌.. ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి ఎల్‌ఓసీ ఇప్పించడమే కాకుండా ఆర్థికసాయానికి హామీ ఇచ్చారు. దీంతో ఆదివారం భిక్షపతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement