చికిత్స పొందుతున్న వ్యక్తి.. | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి..

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

ఖిలా వరంగల్‌ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నపేట రఘునాథ్‌కాలనీకి చెందిన బుర్ర సంపత్‌ (57) సోమవారం ఉదయం వరంగల్‌ ఫోర్ట్‌రోడ్డులో నడుచుకుంటూ రంగశాయిపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్‌ నుంచి రంగశాయిపేట వైపు అతివేగంగా వెళ్తున్న కారు సంపత్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో సంపత్‌ తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు.

పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం

మత్తు పదార్థాల నిర్మూలనపై

ప్రభుత్వ ఉపాధ్యాయుడి అవగాహన

పాలకుర్తి టౌన్‌ : మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్‌ పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం చేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని సంతలో మైకులో మత్తు పదార్థాలు–అనర్ధాలు, రోడ్డు భద్రత, హెల్మెట్‌, సీటు బెల్ట్‌ వాడకంపై అవగాహన కల్పించారు. ‘నో డ్రగ్స్‌–సేవ్‌ లైఫ్‌’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. యువతను నన్మార్గంలో నడిపించేందుకు తన వంతు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్‌, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement