హన్మకొండ: రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేడు(సోమవారం) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 10 గంటలకు ఎల్కతుర్తికి చేరుకుంటారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 11.10 గంటలకు కమలాపూర్ మండలం గూడూరుకు చేరుకుని డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హనుమకొండ నగరానికి చేరుకుని సుబేదారిలోని రెడ్‌క్రాస్ సొసైటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కంచరకుంటలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. 2.50 గంటలకు బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జరిగే కిసాన్ మేళాలో, సాయంత్రం 4 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 5 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. మ్యూజికల్ గార్డెన్ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి కాజీపేట దర్గాకు చేరుకుని దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారు. రాత్రి 8.15 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పొన్నం
ప్రభాకర్


