విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

Aug 9 2026 2:34 AM | Updated on Aug 9 2026 2:34 AM

హన్మకొండ కల్చరల్‌ : విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక శుక్రవారం రాత్రి వరంగల్‌ భద్రకాళిరోడ్‌లోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో నిర్వహించారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా కారెంపూడి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా గొళ్లపల్లి రామానందస్వామి, కోశాధికారిగా గొళ్లపల్లి రామన్నాచార్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాతృసంఘం కన్వీనర్‌ శ్రీరామోజు రవీంద్రాచారి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి పెంటయ్యచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement