మహిళా సాఽధికారతకు ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళా సాఽధికారతకు ప్రభుత్వం పెద్దపీట

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

హసన్‌పర్తి: మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో 65, 66వ డివిజన్ల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. హసన్‌పర్తికి మంజూరైన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు స్థల పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, క్రీడా మైదానం కోసం రెండెకరాల స్థలం సేకరిస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. గ్రేటర్‌ ఒకటో డివిజన్‌లోని పద్మావతినగర్‌కాలనీ, శ్రీనివాసకాలనీ, ఆనంద్‌నగర్‌కాలనీ, దుర్గాకాలనీ, బాలాజీ నగర్‌లో సుమారు రూ.2.65 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. డివిజన్‌ అధ్యక్షులు గొర్రె కిరణ్‌, సునీల్‌, గడ్డం అరుణ్‌, చిర్ర రాము, కనపర్తి కిరణ్‌, పొన్నాల రఘు, దేవరకొండ అనిల్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అశోక్‌, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, గడ్డం శివరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement