● అక్టోబర్ 10 నుంచి అమలు
కాజీపేట రూరల్: తిరుపతి నుంచి కరీంనగర్ (12761)కు వయా గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మీదుగా వెళ్లే బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేళలో స్వల్ప మార్పులు చేసినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 08ః05 గంటలకు బయల్దేరే ఈ ఎక్స్‌ప్రెస్ రాత్రి 07ః50 గంటలకు బయల్దేరుతుందని దెలిపారు. తిరుపతి నుంచి 15 నిమిషాల ముందే బయల్దేరేలా సమయం మార్చినట్లు తెలిపారు. ఈ మార్పు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్వో స్పష్టం చేశారు.
శాయంపేట : ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, పర్యావ రణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యు డు మారెపల్లి సునీల్ ఓ పునుగు పిల్లిని అట వీశాఖ అధికారులకు అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా శాయంపేటలో శుక్రవారం రోడ్డుపై పునుగు పిల్లి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పశువైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించిన ట్లు తెలిపారు. పునుగు పిల్లికి మెరుగైన వైద్యం కోసం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కోటేశ్వర్ రావు, వాచర్ అశోక్ జిల్లా పశువైద్యశాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి సునీల్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జనగణన హ్యాండ్‌బుక్‌కు
వివరాలు సేకరించాలి
న్యూశాయంపేట: జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన గ్రామ డైరెక్టరీ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను నిర్ణీత గడువులోపు పూర్తిచేసి అందజేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ పాల్గొన్నారు.
పీఆర్సీ ప్రకటించాలి
కాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలపై జీఓ జారీ చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ డిమాండ్ చేశారు. యూపీఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉపాధ్యాయులు రోజూ పాఠశాలకు నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతారని స్పష్టం చేశారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధా న కార్యదర్శి పి.వీరాచారి, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, టి.సునీల్‌కుమార్, ఎం.ఉషారాణి, టి.జ్యోతి, పాల్గొన్నారు.


