డిజైన్‌ వస్త్రాల ఉత్పత్తితో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

డిజైన్‌ వస్త్రాల ఉత్పత్తితో ఆదాయం

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

కాశిబుగ్గ: చేనేత కార్మికులు కాలానుగుణంగా మార్కెటింగ్‌ పెంచుకోవడానికి, ఆర్థికాభివృద్ధికి నూతన డిజైన్ల వస్త్రాలను ఉత్పత్తి చేయాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వరంగల్‌ కొత్తవాడలో చేనేత వాక్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పద్మశాలి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత కళ అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. లేటెస్ట్‌ డిజైన్లతో కూడిన ఉత్పత్తులను చేస్తే మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుందని చెప్పారు. కొత్తవాడ దర్రీస్‌కు ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని వివరించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులు మార్కెట్‌కు తగిన ఉత్పత్తులు చేసి, చేనేత సంఘాలు పరిపుష్ఠి అయ్యేలా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ వై.శ్రీకాంత్‌రెడ్డి, ఇండస్ట్రీస్‌ జనరల్‌ మేనేజర్‌ నర్సింహమూర్తి, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ సుధీర్‌, సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్‌, డీఎస్‌ మూర్తి, ఝెలుగం కొమురయ్య, ఝెలుగం రవిరాజ్‌, విజయ్‌కుమార్‌, గుండేటి నరేంద్రకుమార్‌, యెలుగం సాంబయ్య, రాంనర్సయ్య పాల్గొన్నారు.

ఈవీఎంల స్ట్రాంగ్‌ రూం పరిశీలన

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంను అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ రజినీతో కలిసి వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్ట్రాంట్‌ రూమ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

‘సుకన్య సమృద్ధి’ ఉపయోగకరం

బాలికల భవిష్యత్‌ విద్య, ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో ఉపయోగకరమని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ప్రాజెక్టు లక్ష్మీనగర్‌ సెక్టార్‌ విద్యానగర్‌ ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని వరంగల్‌ జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి, సీడీపీఓ విద్యతో కలిసి ఆమె శుక్రవారం సందర్శించారు. గర్భిణులకు పండ్ల బుట్టల ను కలెక్టర్‌ అందజేశారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement