లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

జనగామ: జిల్లాలో లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్‌ కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి పోలీస్‌శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా భద్రత, సంక్షేమం, సాధికారతకు సంబంధించిన ప్రతీ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, పోలీస్‌, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు, బాలికలపై వేధింపులు, గృహహింస, లైంగిక దాడులు, సైబర్‌ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత మహిళలకు చట్టపరమైన రక్షణ, కౌన్సెలింగ్‌, వైద్య సేవలు, పునరావాసం వంటి సేవలను ఒకే వేదికపై అందించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పలువురు బాధిత మహిళల సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మహిళా కమిషన్‌ సెక్రటరీ ప ద్మజారమణ, రెవెన్యూ అదనపు కలెక్టర్‌, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్‌, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ, జిల్లా న్యాయ సేవల సంస్థ, ‘షీ’ టీమ్స్‌, భరోసా కేంద్రం, సఖి కేంద్రం, పోలీస్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

స్కానింగ్‌ కేంద్రాలపై నిరంతర తనిఖీలకు పోలీసులకు ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement