గోడ కూలి వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

గోడ కూలి వృద్ధురాలి మృతి

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

పున్నేలులో ఘటన

ఐనవోలు: ప్రమాదవశాత్తు ప్రహరీ (గోడ) కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడికందుల లక్ష్మీకాంతం(60) రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కులవృత్తిలో భాగంగా అదే గ్రామంలో గండి సదానందం ఇటీవల మృతి చెందగా వారి ఇంట్లో ఐదోరోజు కార్యక్రమానికి గురువారం కూలీకి పని వెళ్లింది. సదానందం ఇంటి ఎదుట పని చేస్తుండగా పక్కన ఉండే కత్తి కృష్ణమూర్తి ఇంటి ప్రహరీ కూలి లక్ష్మీకాంతంపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కోడలు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌.. మృతురాలికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబీలను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ షేక్‌ ఉస్మాన్‌ అలీ, మాజీ సర్పంచ్‌ కత్తి దేవేందర్‌ ఉన్నారు.

రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

రఘునాథపల్లి: మద్యానికి బానిసైన రిటైర్డ్‌ రైల్వే ఉ ద్యోగి క్షణికావేశంలో గడ్డి మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం.. రఘునాథపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి యాదగిరి (70) రైల్వేశాఖలో ఉద్యోగ విరమణ చేసిన అనంతరం సరైన ఉపాధి లేక మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య కనకలక్ష్మితో తరచూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని గొడవపడేవాడు. ఈ నెల 5న మరోసారి భార్యతో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగాడు. అనంతరం క్షణికావేశానికి గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement